బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (10:09 IST)

అమాయకత్వం.. 28సార్లు ఓటీపీ చెప్పింది... రూ.7లక్షల మేర గోవిందా..

అమాయకంగా వున్న పాపానికి ఓ మహిళ రూ.7లక్షల మేర నష్టపోయిన ఘటన ముంబైలో జరిగింది. అమాయకంగా ఆన్‌లైన్ మోసగాడికి 28సార్లు ఓటీపీ చెప్పింది. అంతే ఏకంగా ఏడు లక్షలు మోసపోయింది. 40 ఏళ్ల గృహిణికి ఓ ఆన్‌లైన్ మోసగాడు

అమాయకంగా వున్న పాపానికి ఓ మహిళ రూ.7లక్షల మేర నష్టపోయిన ఘటన ముంబైలో జరిగింది. అమాయకంగా ఆన్‌లైన్ మోసగాడికి 28సార్లు ఓటీపీ చెప్పింది. అంతే ఏకంగా ఏడు లక్షలు మోసపోయింది. 40 ఏళ్ల గృహిణికి ఓ ఆన్‌లైన్ మోసగాడు తనను తాను ఎస్బీఐ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు.


ఏటీఎం కార్డు పనిచేయలేదని, అది పనిచేయాలంటే.. అకౌంట్ వివరాలు, ఏటీఎం వివరాలు, మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాలన్నాడు. అతడి మాటల్ని నమ్మిన మహిళ అన్నీ వివరాలు చెప్పింది. 
 
ఇంకా ఆన్‌లైన్ మోసగాడికి పదే పదే ఓటీపీ చెప్పడంతో 28సార్లు ఓటీపీ తీసుకున్న మోసగాడు..  దాదాపు రూ.7లక్షల దాకా డబ్బు కాజేశాడు. అయితే పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన ఆమె ఖాతా నుంచి  రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసి ఆ మహిళ షాక్ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆన్‌లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. తన భర్త కువైట్‌లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.