సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (08:19 IST)

జమ్మూకశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నరుగా మనోజ్ సిన్హా

జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌చంద్ర ముర్ము తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త లెఫ్టినెంట్ గవర్నరును నియమించారు.

మనోజ్ సిన్హా యూపీలోని ఘాజీపూర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా మూడు సార్లు ప్రాతినిథ్యం వహించారు. రైల్వేసహాయ మంత్రిగా కూడా పనిచేసిన సిన్హాను రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమించారు.