మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (23:03 IST)

చెట్లపై కూర్చుని ఆన్‌లైన్ తరగతులు.. తేని విద్యార్థుల ఫోటోలు వైరల్

Theni
కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నెట్ సిగ్నల్ దొరకని కారణంగా.. కొండపైకెక్కి.. అక్కడున్న ఎత్తైన చెట్లపై కూర్చుని ఆన్‌లైన్ తరగతుల ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం, తేని జిల్లాలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్ తరగతులను తేని విద్యార్థులు.. చెట్ల కింద కూర్చుని లేదా.. కొండపైనున్న ఎత్తైన వృక్షాలపై కూర్చుని వింటున్నారు. 
 
క్రూరమృగాలు సంచరించే కొండ ప్రాంతాలకు ఇలా విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల కోసం ప్రమాదమని తల్లిదండ్రులు వాపోతున్నారు. తేని జిల్లా, కడమలైగుండు ప్రాంతం కొండలతో కూడినది. ఈ కొండల చుట్టూ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని విద్యార్థులు సెల్ ఫోన్లలో సిగ్నల్స్ దొరకని కారణంగా.. చెట్లపైకెక్కి ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నారు. 
 
ఇందుకోసం రోజూ నాలుగు కిలోమీటర్లు నడుస్తున్నారు. కరోనా కాలంలో ఇంటికే పరిమితం కాకుండా ఆన్‌లైన్ తరగతుల కోసం కొండ ప్రాంతాలకు వెళ్లి.. సిగ్నల్స్ కోసం వేచి వుండి మరీ పాఠాలను అభ్యసిస్తున్న తేని జిల్లా విద్యార్థులపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.