శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (14:21 IST)

మరదలే కదా అని ఓవరాక్షన్ చేశాడు.. నడివీధిలో చితకబాదింది..

బావకు ఓ మరదలు నడిరోడ్డుపైనే చుక్కలు చూపించింది. మరదలు అనగానే బావ వరసయ్యే వారు ఏడిపించడం చేస్తుంటారు. అలా బావ, మరదళ్ల సరసాలు చూసేందుకు ముచ్చటగా వుంటాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది. మరదలిపై బావ సరసం

బావకు ఓ మరదలు నడిరోడ్డుపైనే చుక్కలు చూపించింది. మరదలు అనగానే బావ వరసయ్యే వారు ఏడిపించడం చేస్తుంటారు. అలా బావ, మరదళ్ల సరసాలు చూసేందుకు ముచ్చటగా వుంటాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది. మరదలిపై బావ సరసం కాస్త ఎక్కువయ్యే సరికి మరదలికి తిక్కరేగింది.. బావను నడిరోడ్డుపై చితక్కొట్టింది. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో చోటుచేసుకుంది.
 
మీరట్‌కు చెందిన ఓ వ్యక్తి తన మరదలిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో ఓపిక నశించిన సదరు మరదలు బావను నడి వీధిలోకి లాగి అందరూ చూస్తుండగానే చితకబాదింది. తనపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడని.. ప్రతిఘటించే సమయంలో తన గాయాలైనాయని తలను చూపించింది. మరదలు ఇలా నడిరోడ్డుపైనే చితకబాదుతుందని తెలియక షాక్‌కు గురైన అతను బేల చూపులు చూస్తూ ఏమీ తెలియనివాడిలా కూర్చుండిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.