ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:31 IST)

మైనర్ బాలికపై సహచర ఉద్యోగుల అకృత్యం.. పోలీస్ అధికారి కూడా..?

సహచర ఉద్యోగులే ఆ మహిళ కన్నబిడ్డపై అకృత్యానికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ పోలీసు అధికారి ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్నఓ మహిళ తన కుమార్తె (13)తో కలిసి భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కాగా రెండు నెలల క్రితం మహిళ తన ఉద్యోగం పని మీద ఆఫీసులో ఉండగా, ఆమె సహచర ఉద్యోగులు మహిళ కుమార్తెపై కన్నేశారు.
 
బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉందని గమనించి బాలికపై అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నారు. ఓ పోలీసు అధికారితో కలిసి బాలికపై అకృత్యానికి పాల్పడ్డారు. బయటకు చెబితే తల్లీ, కూతుళ్లను చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆ బాలిక మౌనంగా భరించాల్సి వచ్చింది.
 
ఇదిలా ఉంటే బాలిక కొద్ది రోజులుగా అనారోగ్యం పాలవడంతో, ఆమె తల్లి ఆరా తీయగా, బాలిక భయపడుతూ జరిగిన సంగతి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద నిందితులను అరెస్టు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.