మాస్క్‌పై మత్తు చల్లి... మైనర్ బాలికపై బలాత్కారం... ఎక్కడ?

facemask
ఠాగూర్| Last Updated: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:55 IST)
అభంశుభం తెలియని మైనర్లు కూడా కామాంధుల కంబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. ఈ కామాంధులు ఆటలు కట్టించేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితంగా మాత్రం శూన్యంగానే ఉంది. తాజాగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అదీకూడా.. కరోనా వైరస్ సోకకుండా ముఖానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి... ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన ఓ లేబర్ కాంట్రాక్టర్... తన వద్ద పని చేసే ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. అందుకే.. ఆమెకు ఓ కొత్త మాస్క్ కొనిచ్చాడు. ఈ ఫేస్‌మాస్కుపై మత్తు చల్లి, దాన్ని ఆమెకిచ్చాడతను. విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది.

ఆ తర్వాత స్పృహతప్పింది. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :