శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (17:44 IST)

కాల్షియం స్థాయి రక్తంలో అధిక పెరుగుదల ప్రమాద కారకమా?

ఇటీవల కనకదుర్గ అనే 24 సంవత్సరాల వయసు కల ఒక మహిళ పునరావృతమైన(మళ్ళీ వచ్చిన) ఎముక విరుగుట మరియు వివరించి చెప్పలేని ప్యాంక్రియాటైటిస్ చికిత్స కొరకు విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌కు వచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన మణిపాల్ డాక్టర్లు రక్తంలోని కాల్షియం స్థాయి కారణంగా ఆమె పారాథైరాయిడ్ గ్రంధి వ్యాధితో బాధపడుతున్నట్లు, అందువలననే  పైసమస్యలు తలెత్తినట్లు రోగ నిర్ధారణ చేసారు. అటుతర్వాత నిర్వహించిన స్కాన్స్ పరీక్షలు ద్వారా అది పారాథైరాయిడ్ గ్రంది కణితి(అడేనోమా)గా నిర్థారించారు.
 
పారాథైరాయిడ్ అడెనోమా అంటే హైపర్ పారాథైరాయిడిజం కారణంగా పారాథైరాయిడ్ గ్రంధిలో ఏర్పడే కణితి, పారాథైరాయిడ్ గ్రంధి మన రక్తంలోనికి అధిక స్థాయిలో కాల్షియం విడుదల చేయటం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాల అరుదుగా సంభవించే పరిస్థితి, సాధారణంగా పెద్దలలో సుమారు 1% నుంచి 2% దీని ప్రభావానికి లోనవుతారు. ఎముకలు విరగటం (10%), మూత్రపిండాల్లో రాళ్ళు (13%), ప్యాంక్రియాటైటిస్ (7%) మరియు కండరాలు & ఎముకల నొప్పులు (60%) వంటి సమస్యలతో వచ్చే రోగులలో ఈ పరిస్థితి కనపడుతుంది.
 
ఈ వ్యాధి శస్త్ర చికిత్స చాల క్లిష్టంగా వుంటుంది. మణిపాల్ హాస్పిటల్ నందు ఆమెకు శస్త్ర చికిత్సను డాక్టర్ మురళీకృష్ణ గంగూరి, కన్సల్టెంట్ డయాబెటిస్ & ఎండోక్రైనాలజి, మణిపాల్ హాస్పిటల్ వారి మార్గదర్శకత్వంలో డాక్టర్ వి.వి.కె.సందీప్, కన్సల్టెంట్ ఇఎన్‌టి, హెడ్ & నెక్ సర్జరీ-మణిపాల్ హాస్పటల్ వారు నిర్వర్తించారు. ఈ మొత్తం శస్త్ర చికిత్స కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డాక్టర్ అనుపమ, కన్సల్టెంట్ పాథాలజీ వారు శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు ప్రకటించారు.
 
డాక్టర్ వి.వి.కె.సందీప్, కన్సల్టెంట్ ఇఎన్‌టి, హెడ్ & నెక్ సర్జరీ- మణిపాల్ ఈ శస్త్ర చికిత్స సందర్భంగా మాట్లాడుతూ, “ఈ కేసు తమకు ఒక ప్రత్యేక సవాలుగా పరిణమించినదని, గ్రంధి  అసాధారణంగా పెరిగిపోవటం వలన కణితిని తొలగించునపుడు కామన్ కరోటిడ్ మరియు పునరావృతమైన స్వరపేటిక నాడికి ప్రమాదం వాటిల్లవచ్చును. అందువలననే ఈ శస్త్ర చికిత్సను అత్యంత శ్రద్ధతో జాగ్రతలు పాటిస్తూ మరియు నైపుణ్యవంతంగా నిర్వహించాము“ అని అన్నారు.
 
మేము ఒక ప్రత్యేకమైన ఇంట్రా ఆపరేటివ్ పిటిహెచ్ పర్యవేక్షణ ద్వారా పారాథైరాయిడ్ హార్మోను స్థాయిలను పర్యవేక్షించుట వలన కణితి తొలగింపునకు మాకు సరియైన అంచనా లభించినట్లు చెప్పారు. ( కణితి తొలగించిన 10 నిముషాలలో హార్మోను స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి, అంటే శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు ఇది సూచిక అన్నమాట ).
 
ఈ శస్త్ర చికిత్స గురించి డాక్టర్ మురళీకృష్ణ గంగూరి, కన్సల్టెంట్ డయాబెటిస్ & ఎండోక్రైనాలజి, మణిపాల్ హాస్పిటల్ మాట్లాడుతూ “ ఇలాటి కేసులు చాల అరుదుగా ఉంటాయని, ఈ ప్రత్యేకమైన కణితి అతి సులువుగా  తప్పించుకుంటుందని, రోగ నిర్థారణ చేయటం కష్టమవుతుంది“ అన్నారు. డాక్టర్ అనుపమ,కన్సల్టెంట్ పాథాలజీ వారి సహకారంతో ఫ్రాజేన్ సెక్షన్ మరియు ఇంట్రా ఆపరేటివ్ పిటిహెచ్ ద్వారా నిముషాలలోనే చేయగలిగాము. పేషంటు ను (రోగిని) శస్త్ర చికిత్సకు ముందు మరియు శస్త్ర చికిత్స తర్వాత అత్యంత సురక్షితమైన సంరక్షణలో ఉంచాము” అన్నారు. రక్తంలో కాల్షియం స్థాయిలు అధికంగా వున్నప్పుడు దానిని పరీక్షించుట చాల ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
 
24/7 అందుబాటులో అత్యంత ఆధునుక వైద్య పరికరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మణిపాల్ హాస్పిటల్- విజయవాడ నందు విశిష్ట అనుభజ్ఞులైన వైద్య బృందం ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించినది.