శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (18:31 IST)

ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న తుంగభద్ర నది

తుంగభద్ర పైభాగం ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వరద నీరు తుంగభద్ర జలాశయానికి వచ్చి చేరుతుండటంతో బుధవారం జలాశయం అధికారులు 30 క్రస్ట్ గేట్లను 2.50 అడుగుల మేర ఎత్తి సుమారు లక్ష 12 వేల క్కుసేకుల నీటిని దిగువకు విడుదల చేశారు. 
 
బుధవారం సాయంత్రానికి తుంగభద్ర వరద ఉధృతి తగ్గడంతో 18 క్రస్ట్ గేట్లు మూసివేసి కేవలం 12 గేట్లు ద్వారా 36,276 క్కుసేకులు మాత్రమే నదికి వదులుతునట్లు బోర్డ్ అధికారులు వెల్లడించారు.
 
తుంగభద్ర జలాశయానికి నీటి చేరికలో హెచ్చుతగ్గుదల ఉన్నా.. నదికి నీరు వదులుతున్న కారణంగా నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇప్పటికే బోర్డ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్ర నదీ ప్రవాహం కారణంగా హంపి పరిసరాలు, చారిత్రక కట్టడాలు నీట మునిగాయి. 
 
ఇప్పటికే నదిలో పురందదాసుల మండపాలు, ఇతరాత్ర సమాధులు నీటమునిగాయి. హంపిలో తుంగభద్ర నది ఒడ్డున ఏర్పాటు చేసిన స్నానఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరినీ నది ఒడ్డుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.

బళ్లారి - కొప్పల జిల్లాల వారధిగా ఉన్న కంప్ల వంతెనపై నీరు వెళ్తుండడంతో ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు మూసివేశారు. కంప్ల కోట ప్రాంతంలోకి నీరు చొరబడటంతో అక్కడి నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.