శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (13:14 IST)

హిజ్రాలను చంపేసిన కిరాతకులు.. ఎక్కడ?

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు హిజ్రాలతో పాటు.. వారి భర్తను కొందరు కిరాతకులు దారుణంగా హత్య చేశారు. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూత్తమల్లికి చెందిన హిజ్రాలు భవాని, అనుష్క, ఆమె భర్త మురుగన్‌లు గురువారం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో వారితో కలిసి నివసించే సహ హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
 
వారిచ్చిన సమాచారంతో పాళయంకోట చౌరస్తా సమీపంలో ఉన్న బావిలో గోనె సంచుల్లో కట్టి పడేసిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసిన తోటి హిజ్రాలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.