Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దగ్గు, జ్వరంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం-విశ్రాంతి అవసరం

Written By సెల్వి
Updated: శనివారం, 4 నవంబరు 2023 (22:37 IST)
దగ్గు, జ్వరంతో బాధపడుతున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు వైరల్ ఫీవర్ అని వైద్యులు నిర్ధారించారు. 
 
అంతేగాకుండా జ్వరం తగ్గేందుకు తగిన చికిత్స అవసరమని.. కొద్దిరోజులు పూర్తి స్థాయి విశ్రాంతి కావాలని హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. వర్షాకాలంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌కు కూడా వైరల్ ఫీవర్ సోకింది. విశ్రాంతి లేకుండా సభలు నిర్వహించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభించడంలో నిరంతరం బిజీగా ఉండడం వల్లే సీఎం స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆయనకు కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

అన్నీ చూడండి

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

తర్వాతి కథనం
Show comments