బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (22:31 IST)

ధారావిలో మూడుకి చేరిన కరోనా మృతులు.. 7లక్షల మందికి టెస్టులు

దేశ వాణిజ్య నగరం ముంబై ధారావిలో కరోనా మృతుల సంఖ్య 3కి చేరింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలో గురువారం ధారావిలో మరో కరోనా మృతి నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. అలాగే ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడంతో ఆ ప్రాంతంలో నివసించే లక్షలాది మంది ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ధారావిలో నివసించే ఏడు లక్షల మందికి రాబోయే 12 రోజుల్లో కరోనా టెస్టులు చేయనున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇందుకోసం ప్రైవేట్ వైద్యుల సాయం తీసుకోనున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. 
 
ఇకపోతే.. భారత్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం 1135 కరోనా కేసులు నమోదుకాగా, 72మంది మృతి  చెందారు.