ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:37 IST)

ఫూటుగా తాగిన ఫ్రెండ్స్.. డ్యాన్స్ చేసేందుకు నో చెప్పాడని స్నేహితుడినే చంపేశాడు..

ముంబై నగరంలో మహిళలపై అఘాయిత్యాలతో పాటు నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. తాను కోరిన పాటకు డ్యాన్స్ చేయలేదనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడినే కొట్టి చంపేసాడు ఓ దుండగుడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

ముంబై నగరంలో మహిళలపై అఘాయిత్యాలతో పాటు నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. తాను కోరిన పాటకు డ్యాన్స్ చేయలేదనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడినే కొట్టి చంపేసాడు ఓ దుండగుడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 14న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

సుబ్రబేన్ అంథేరీకి చెందిన అంకుష్ జాదవ్ అతని స్నేహితుడు శ్రీవథాక్థర్‌లు కలిసి ఫూటుగా తాగారు. మద్యం మత్తులో ఉన్న సమయంలోనే శ్రీవథాక్థర్ తన స్నేహితుడు జాదవ్ ను డ్యాన్స్ చేయాలని కోరాడు.
 
కానీ జాదవ్ తాను డ్యాన్స్ చేసేందుకు నో చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన వాగ్వివాదం గొడవకు దారితీసింది. ఈ గొడవను పక్కనున్న స్నేహితులు కూడా ఆపలేకపోయారు. శ్రీవథాక్థర్ ఆగ్రహంతో జాదవ్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అంకుష్ యాదవ్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ జాదవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.