సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (18:51 IST)

వాట్సాప్‌లో అలాంటి వీడియోలు షేర్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త

నెటిజన్లు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్‌ను వాడని వారంటూ వుండరు. కానీ వాట్సాప్‌లో మంచి విషయాలను షేర్ చేసుకునే వారికి సమస్య వుండదు కానీ.. ఇక వాట్సాప్‌లో అశ్లీల, శృంగార వీడియోలు షేర్ చేసుకునేవారంతా తస్మాత్ జాగ్రత్తగా వుండాలని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
తాజాగా ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచ్చలవిడిగా శృంగార వీడియోలను అతను వాట్సాప్ ద్వారా షేర్ చేయడంతో అతనిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ట్రిపుల్ ఎక్స్‌తో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. అందులో అశ్లీల, శృంగార వీడియోలను పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల ముస్తాక్ అలీ షేక్ అనే వ్యక్తి షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
ఐటీ చట్టం ప్రకారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారని, మహిళ నెంబర్ పొరపాటున ఆ గ్రూపులో చిక్కుకుపోవడంతో.. ఆమెకు శృంగార వీడియోలు ప్రవాహంలా రావడంతో.. పోలీసులను సంప్రదించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.