శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:16 IST)

మురుగన్ ఇడ్లీ షాప్.. ఇడ్లీలో పురుగు.. వాట్సాప్ ద్వారా..?

చెన్నైలోని ప్రముఖ హోటల్‌ వివాదంలో చిక్కుకుంది. మురుగన్ ఇడ్లీ షాప్ అనేది చెన్నైలో పాపులర్ హోటల్. ఇక్కడ ఇడ్లీలలో వెరైటీలు కస్టమర్లకు అందిస్తారు. చెన్నైలో ఈ ఇడ్లీ షాపుకు 20 బ్రాంచ్‌లున్నాయి. ఈ నేపథ్యంలో మురగన్ ఇడ్లీ బ్రాడ్‌వే బ్రాంచ్‌లో.. సెప్టెంబర్ 7వ తేదీ కస్టమర్ ఒకరికి ఇడ్లీలను అందించారు. ఆ ఫుడ్‌లో పురుగు వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
అంతేగాకుండా సదరు వినియోగదారుడు ఆహారంలో పురుగు వుండటాన్ని ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆహార భద్రతా అధికారులు బ్రాడ్ ఇడ్లీ షాపుకు వెళ్లి పరిశోధన చేశారు. అక్కడ ఇడ్లీలో పురుగు వుండటం నిజమేనని తెలిశాక.. అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగిలోనూ తనిఖీలు చేశారు. 
 
అక్కడ పారిశుద్ధ్యం లోపించిందని.. నాణ్యత కూడా అంతంత మాత్రంగా వుండటం తేలింది. దీంతో అంబత్తూరులోని మురుగన్ ఇడ్లీ షాపు గిడ్డంగికి తాత్కాలికంగా అధికారులు సీల్ పెట్టారు. దీనిపై మురుగన్ ఇడ్లీ ఓనర్ వద్ద వివరణ కోరుతూ నోటీసులు పంపారు.