శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (11:27 IST)

రొయ్యలు కీటకాల జాతికి చెందినవి.. ఫత్వా జారీ.. ముస్లింల అసంతృప్తి

రొయ్యలు చేపల కిందకు రావని.. అవి కీటకాల జాతికి చెందినవని పేర్కొంటూ.. ముస్లింలెవరూ రొయ్యలు తినరాదంటూ జామియా నిజామియా చీఫ్ ముఫ్తీ మహమ్మద్ అజీముద్దీన్ ఫత్వా జారీ చేశారు. రొయ్యలు తినడం అత్యంత హేయమైన చర్య అ

రొయ్యలు చేపల కిందకు రావని.. అవి కీటకాల జాతికి చెందినవని పేర్కొంటూ.. ముస్లింలెవరూ రొయ్యలు తినరాదంటూ జామియా నిజామియా చీఫ్ ముఫ్తీ మహమ్మద్ అజీముద్దీన్ ఫత్వా జారీ చేశారు.

రొయ్యలు తినడం అత్యంత హేయమైన చర్య అంటూ అజీముద్దీన్ పేర్కొన్నారు. దాదాపు 142 ఏళ్ల చరిత్ర ఉన్న ఇస్లామిక్ వర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 
 
ఇస్లామిక్‌ ప్రకారం ఆహారాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు. హలాల్, హరామ్, ముక్రూ అనే మూడు విభాగాల కింద ఆహారాన్ని చేర్చుతారు. ఇందులో మూడో విభాగంలో మరో రెండు విభాగాలున్నాయి. అవి ముక్రూ, ముక్రూ తహరీమ్. హలాల్ సమ్మతించిన ఆహారంగా, హరామ్ నిషేధించిన ఆహారంగా పేర్కొంటే ముక్రూ హేయమైన ఆహారంగా చెప్తారు. హేయమైన ఆహారాల్లో ముక్రూ తహరీమ్ అంటే తినకూడనది. 
 
ఇందులో జామియా నిజామియా ఇచ్చిన ఫత్వాలో రొయ్యలను ముక్రూ తహరీమ్‌గా పేర్కొంది. ఈ మేరకు జనవరి 1న జారీ చేసిన ఫత్వా చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థ ఇచ్చిన ఆదేశాలపై ముస్లిం వర్గాల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అజీముద్దీన్ ఫత్వా పట్ల కొందరు ముస్లిం పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.