గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (12:08 IST)

ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధికారిక ట్విట్టర్ ఖాతాను శనివారం అర్థరాత్రి హ్యాకింగ్‌కు గురైంది. ఈ సమస్యను గుర్తించిన సాంకేతిక నిపుణులు తక్షణం పునరుద్ధరించే ప్రయత్నాలు సాగుతున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
కాగా, ఈ నెల 12వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాకామంత్రి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఎలాన్ మస్క్‌గా మార్చడంతో పాటు 50కి పైగా వరుస ట్వీట్లు చేశారు. అలాగే, ఇపుడు మరో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఖాతాను హ్యాక్ చేశారు. ఇటీవలి కాలంలో భారత్‌‍లో ట్విట్టర్ ఖాతాలో వరుసగా హ్యాకింగ్‌కు గురవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది.