గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (10:26 IST)

గోవాలో కనిపించకుండా పోయిన నేపాల్ మేయర్ కూతురు

Nepal Mayor
Nepal Mayor
నేపాల్ మేయర్ కూతురు గోవాలో కనిపించకుండా పోయింది. తన కూతురు ఆరతి హమాల్ ఓషో మెడిటేషన్ ఫాలోవర్ అని, మెడిటేషన్ కోసం కొద్ది నెలలుగా గోవాలోనే ఉంటోందని తెలిపారు. అయితే, గత సోమవారం రాత్రి నుంచి ఆరతి కనిపించడంలేదని ఆమె స్నేహితురాలు ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇచ్చిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పిన గోపాల్.. గోవా ప్రజల సాయం కోరారు.
 
మెడిటేషన్ కోసం ఇండియా వచ్చిన నేపాల్ మేయర్ కూతురు గోవాలో కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. ఆరతి హమాల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ మొబైల్ ఫోన్ నెంబర్లను పోస్టు చేశారు. 
 
కనిపించకుండా పోయిన పెద్ద కూతురు ఆరతి హమాల్‌ను వెతికేందుకు తన చిన్న కూతురు, అల్లుడు గోవాకు బయలుదేరారని చెప్పారు.