బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (21:49 IST)

తొలి రాత్రి.. గదికి వచ్చిన వరుడికి షాక్.. నవ వధువు ఏం చేసిందంటే?

ఎన్నో ఆశలతో తొలి రాత్రి గదికి వచ్చిన వరుడికి షాక్ తప్పలేదు. ఎందుకంటే ఆ వరుడికి తొలిరాత్రే షాకిచ్చింది నవ వధువు. గదిలోకి వెళ్లగానే ఐరన్‌ రాడుతో భర్త తల మీద కొట్టి డబ్బు, నగలతో పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని హరిద్వార్‌కు చెందిన యువతికి బింజోర్‌లోని కుండా ఖుర్ద్‌కు చెందిన యువకుడికి మార్చి 15న గుడిలో వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. 
 
తొలి రాత్రి గదిలోకి వెళ్లగానే కట్టుకున్న భర్త మీద ఐరన్‌ రాడితో దాడి చేసింది వధువు. దీంతో అతడు పెద్దగా కేకలు వేయగా.. బంధువులు గదిలోకి వచ్చేసరికి ఆమె అక్కడ నుంచి డబ్బు, నగలు తీసుకుని పారిపోయింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కోసం గాలిస్తున్నారు. అలాగే ఈ పెళ్లి కుదిర్చిన పెళ్లిళ్ల పేరయ్య కోసం వెతుకుతున్నారు.