సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:07 IST)

ప్రధానిని హత్య చేస్తానంటూ బెదిరింపు.. హైఅలెర్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానంటూ ఓ అగంతకుడు ఈమెయిల్ పంపించాడు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాలకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 
 
తన వద్ద 20 కేజీల ఆర్డీఎక్స్ ఉన్నట్టు వెల్లడించిన అగంతకుడు ఆర్డీఎక్స్ సేకరణకు తనకు కొందరు ఉగ్రవాదులు సహకరించినట్టు వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రధానిని చంపేస్తానని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా 20 చోట్ల దాడులకు కుట్ర పన్నినట్టు అగంతకుడు ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ దాడులతో 2 కోట్ల మందిని చంపుతానని బెదిరించాడు. ఈ దాడుల కోసం 20 స్లీపర్ సెల్స్‌ను రంగంలోకి దించినట్టు ఆ అగంతకుడు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.