శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (12:29 IST)

నిత్యానందతో ఆ వీడియోలో రంజిత.. కోర్టులో పిటిషన్.. ఎందుకో తెలుసా?

నిత్యానందతో రంజిత కలిసివుండే వీడియోను 2010లో ఓ టీవీ ప్రసారం చేసింది. ఆ వీడియోలో రంజిత, నిత్యానంద అభ్యంతరకర రీతిలో వుండటం అప్పట్లో సంచలనానికి దారితీసింది. ఈ కేసుకు సంబంధించి చెన్నై సైదాపేట కోర్టులో విచ

నిత్యానందతో రంజిత కలిసివుండే వీడియోను 2010లో ఓ టీవీ ప్రసారం చేసింది. ఆ వీడియోలో రంజిత, నిత్యానంద అభ్యంతరకర రీతిలో వుండటం అప్పట్లో సంచలనానికి దారితీసింది. ఈ కేసుకు సంబంధించి చెన్నై సైదాపేట కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ వీడియో ద్వారా తమ వద్ద డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని.. టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేసి ఈ వీడియోను లీక్ చేశారంటూ నిత్యానంద ధ్యాన పీఠం నిర్వాహకులు కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో గత ఏడు సంవత్సరాల పాటు జరిగిన ఈ కేసు చివరి దశకు చేరిన నేపథ్యంలో.. ఉన్నట్టుండి నటి రంజిత చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఏముందంటే? సీబీసీఐడీ పోలీసులు ఈ కేసులో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్తీరావ్, ఈ-మెయిళ్లను సరిచూడలేదని.. ఆర్తీ రావ్ వినయ్ భరద్వాజ్‌తో చేర్చి వీడియో విషయంలో కుట్ర పన్నారని ఆరోపించారు.
 
అందుచేత ఈ-మెయిళ్లను పరిశోధించాలని.. ఇంకా నిత్యానందపై ఆర్తీరావ్ నమోదు చేసిన కేసు కర్ణాటక సెషన్స్ కోర్టులో విచారిస్తున్నారని.. అక్కడ గల అసలు వీడియోను పోలీసులు తెప్పించుకోలేదన్నారు. నకిలీ వీడియోతో ఈ కేసు విచారణ జరుగుతుందని రంజిత పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుచేత ఈ కేసులు పునః విచారణ జరపాలని సీబీసీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని రంజిత కోరారు. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన కోర్టు... వివరణతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని సీబీసీఐడీ పోలీసులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.