మూడు నెలలు నో కరెంట్ బిల్

Written By ఎం
Updated: మంగళవారం, 31 మార్చి 2020 (12:50 IST)
మూడు నెలలు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ బారిన పడిన దేశాలలో ఇండియా కూడా ఉన్నది. ఇండియాలో మొత్తం 1071 మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 

కరోనా వలన వలస కూలీలు రోడ్డున పడ్డారు. రోడ్డున పడిన కూలీలకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక ఇప్పటికే చాలామంది ఇంటికే పరిమితం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కొంత డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

దీంతో పాటుగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నీ రకాల లోన్లపై మూడు నెలల మారటోరియం విధించింది.  
 
అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరెంటు బిల్లు చెల్లింపులకు సంబంధించి అన్నీ రాష్ట్రాలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కరెంటు బిల్లుల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించాలని కోరింది.

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మూడు నెలల పాటు కరెంట్ బిల్లులపై మారటోరియం విధించాలని కేంద్రం పవర్ జనరేషన్ కంపెనీలను కోరింది.

అన్నీ చూడండి

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments