భర్త మొబైల్, ల్యాప్‌టాప్‌లలో మహిళల అశ్లీల వీడియోలు, భార్య షాక్..?
కొత్తగా పెళ్ళయ్యింది. అది కూడా కరోనా సమయంలో. రెండు నెలలు మాత్రమే అవుతోంది పెళ్ళయి. సాధారణంగా అయితే కొత్తగా పెళ్ళయిన జంట ఎలా ఉంటారు. శృంగారంలో విజృంభించేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. భార్యను దూరం పెడుతూ వచ్చాడు భర్త. అయితే అసలు విషయం భార్యకు ఆలస్యంగా తెలిసి షాక్‌కు గురైంది.
తంజావూర్‌కు చెందిన ఒక బ్యాంకు క్యాషియర్ జయకుమార్, శిల్పలకు రెండు నెలల క్రితం వివాహమైంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళే. పెళ్ళి తరువాత శోభనం జరగడం మామూలే. అయితే శోభనానికి వచ్చిన భర్త తనను పట్టించుకోకుండా పడుకొని నిద్రపోతున్నాడు.
కొన్నిరోజుల తరువాత భర్త తనకు దగ్గరవుతాడులే అనుకుంది ఆ భార్య. కానీ రెండు నెలలు గడిచింది. భార్య ఆశలన్నీ ఆవిరయ్యాయి. భర్తపై అనుమానం వచ్చింది. తను నిద్రపోతున్న సమయంలో కొన్ని మొబైల్ ఫోన్లు భర్త చూడటం.. దాంతో పాటు ల్యాప్‌టాప్‌ను రహస్యంగా చూస్తూ కూర్చోవడం జయకుమార్ చేస్తున్నాడని గమనించింది.
దీంతో ఆమె అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించింది. భర్త రోజూ తాళాలు వేసుకెళ్ళే లాకర్‌ను పగులగొట్టింది. అందులో 12 సెల్‌ఫోన్లు. ఆ సెల్ ఫోన్లలో అన్నీ శృంగారపు వీడియోలే. అంతేకాదు, కొన్ని తన భర్త వేరే మహిళలతో పాల్గొన్న శృంగార వీడియోలు, చిత్రాలు ఉన్నాయి.
దీంతో షాకైంది. ఇక ల్యాప్ టాప్ కూడా చూద్దామని పాస్‌వర్డ్‌ను తెలుసుకుని ఓపెన్ చేసింది. అందులో అదే తంతు. ఇక భర్త చేష్టలు అర్థమై పోలీసులను ఆశ్రయించింది. శృంగార పురుషుడి వీడియోలను పోలీసులకు అప్పగించింది. పోలీసులు జయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.