ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (13:54 IST)

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు విరుద్ధం : కాంగ్రెస్

lok sabha house
ఒకే దేశం - ఒకే ఎన్నిక బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు 200 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 143మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అయితే, ఈ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఘాటుగా స్పందించారు. జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. దీన్ని కేంద్రం తక్షణమే ఉపసహరించుకోవాలి అని అన్నారు.
 
సమాజ్ వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ స్పందిస్తూ, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయి అని చెప్పారు. 
 
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ, జమిలి ఎన్నికలంటే రాష్ట్రాలక హక్కులను హరించడమేనన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ అని చెప్పారు. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు. ఎన్నికల సంస్కరణల కావాలి. గతంలో ఎన్.జె.ఏ.సి బిల్లును కూడా ఇలానే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు. ఆ తర్వాత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఎన్.జె.ఏ.సి. విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. జమిలి ఎన్నికల చట్టానికి కూడా అదే పరిస్థితి ఏర్పడుందన్నారు. 
 
ఎస్పీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ, ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే అవుతుందన్నారు. జమిలి ఎన్నికల బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపాలని లేదా దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
 
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లుపై స్పందిస్తూ, 'ఈ బిల్లును జేపీసీకి పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేబినెట్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు' అని పేర్కొన్నారు.