బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:27 IST)

ప్రేమించలేదని యువతిని పొలంలోకి లాక్కెళ్లి తాళి కట్టి ఆ తర్వాత...

కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. సమీప పట్టణంలో కాలేజీలో చదువుతున్న ఓ యువతిపై మేకలు కాపరి కన్నేశాడు. రోజూ ఆమె వెంట పడుతూ తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. ఐతే ఆ యువతి అతడిని పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ ప్రేమంటే తగిన బుద్ధి చెపుతానని హెచ్చరించింది. దాంతో అతడు పగతో రగిలిపోయాడు.
 
వివరాల్లోకి వెళితే... తుమకూరు లోని దొడ్డగోళ గ్రామానికి చెందిన కావ్య అనే యువతి పియుసి చదువుతోంది. రోజూ శిరలోని కాలేజీకి వెళ్లు వస్తుంటుంది. ఈ క్రమంలో అక్కడ పక్కనే పొలాల్లో మేకలు మేపుకునే కాపరి ఆమెపై కన్నేశాడు. తనను ప్రేమించాలనీ, పెళ్లి చేసుకోవాలంటూ వెంటబడ్డాడు. ఐతే ఆమె అతడిని పట్టించుకోలేదు. అతడిని హెచ్చరించింది. 
 
దాంతో పగ పెంచుకున్న మేకల కాపరి వీరన్న ఆమె కళాశాలకు వెళ్తుండగా ఆమెను బలవంతంగా బైకుపై ఎక్కించుకుని సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ముఖం, గొంతుపై విచక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
 యువతి మెడలో తాళిబొట్టు కూడా వుండటంతో ఆమెకు బలవంతంగా పసుపు తాడును కూడా గమనించారు. దుండగుడు ఆమె మెడలో బలవంతంగా పసుపు తాడు కట్టినట్లు తెలుస్తోంది. కాగా నిందితుడిని 24 గంటలు గడవక ముందే అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని, మోటారు బైకును స్వాధీనం చేసుకున్నారు.