శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (14:48 IST)

మహిళా బిల్లు ఆమోదం.. ఢిల్లీలో కవిత దీక్ష.. 29 రాష్ట్రాల నుంచి..?

Kavitha
పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత దీక్ష చేపట్టనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఈ దీక్ష జరుగనుంది. 
 
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న కవిత.. ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఇంకా మహిళా బిల్లు ఆమోదం కోసం దీక్ష చేపట్టనున్నారు. ఆమె దీక్షకు దేశ వ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. 
 
కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు దీక్షకు హాజరవుతారని తెలుస్తోంది. ఈ దీక్షలో విపక్షాలు జంతర్ మంతర్ వేదికగా బల ప్రదర్శనకు దిగనున్నాయి. ఈ దీక్షలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, పీడీపీ వంటి పలు పార్టీలు పాల్గొననున్నాయి.