1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (16:24 IST)

ఒకే ఆస్పత్రిలో 81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ

యూపీలో ఒకే ఆస్పత్రిలో  81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ సోకింది. మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 16 నెలల్లో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ సోకింది. , దీనిపై తాము విచారణకు ఆదేశించామని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
 
ప్రసవం కోసం వచ్చిన 81 మంది గర్భిణీ స్త్రీలకు హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని.. బాధిత మహిళలు మెడికల్ కాలేజీలోని సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 
 
18 నెలలు నిండిన తర్వాత నవజాత శిశువులకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. హెచ్‌ఐవీ సోకిన మహిళలు, నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని మీరట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ) డాక్టర్‌ అఖిలేష్‌ మోహన్‌ ప్రసాద్‌ చెప్పారు.