సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (17:09 IST)

కె. విజ‌య‌భాస్కర్ చిత్రం జిలేబి నుంచి ఆకు పాకు పాట విడుదల

Srikamal, Shivani Rajasekhar
Srikamal, Shivani Rajasekhar
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జిలేబి హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఆకు పాకు' అనే పాటని విడుదల చేశారు మేకర్స్. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ పాటని క్యాచి నెంబర్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా పాడిన ఈ పాటలో లీడ్ పెయిర్ కంగారు పడుతూ పరుగులు తీయడం థ్రిల్లింగ్ గా వుంది.