గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (22:59 IST)

శ్రీకాళహస్తి: కళ్లు తెరిచిన శివయ్య.. శివలింగం నుంచి..?

Lord shiva
Lord shiva
శ్రీకాళహస్తిలో శివలింగానికి కళ్లు కనిపించాయి. దీంతో శివుడు కళ్లు తెరిచాడంటూ భక్తులంతా ఆ శివలింగానికి పూజ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో పురాతన శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచిందని పూజారి చెప్పాడు. ఈ మాట భక్తులకు తెలియరావడంతో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. 
 
శ్రీ కాళహస్తిలోని ఈటిసి కేంద్రంలో నాటి కాళహస్తి రాజులచే నిర్మించబడిన శివాలయం వెలిసి ఉంది. ఈ ఆలయంలో శివయ్య కళ్లు తెరిచాడు. ఈ ఆలయాన్ని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాధ్ పిలుస్తారు. ఈ శివాలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న గంగయ్య అభిషేక పూజలు చేసి అలంకారం చేసిన తర్వాత స్వామి వారు కళ్ళు తెరిచినట్లు గమనించారు. 
Shiva
Shiva
 
భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పడుతుండడంతో సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు వచ్చి భక్తులను నియంత్రిస్తూ వారికి దర్శనం కల్పించారు. ఈ ఆలయానికి సంబంధించిన తాజాగా శివలింగం కళ్లు తెరిచిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.