ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (18:25 IST)

నా శవం కూడా బీజేపీలో చేరదు... కపిల్ సిబాల్

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా జారిపోతున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలు కూడా జంప్ అవుతుండడం నేతల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రంగా స్పందించారు. తాను కాదు..తన శవం కూడా బీజేపీలో చేరదని, ఆ భావజాలపు రాజకీయ పార్టీలోకి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లనని కుండబద్ధలు కొట్టారు.
 
జితిన్ ప్రసాద్ చేరితో కాంగ్రెస్ పార్టీలో విబేధాలు స్టార్ట్ అయ్యాయని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై సిబాల్‌ను ప్రశ్నించగా..తాను పుట్టి పెరిగినప్పటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చానన్నారు.
 
పార్టీ నుంచి జితిన్ వెళ్లాలని అనుకుంటే..వెళ్లవచ్చు..ఆ పార్టీలో వెళ్లడం..అందులో దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్న రాజకీయాల వైపుకు వెళ్లడం..తాను తప్పుబడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, భావ జాలపరమైన రాజకీయాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.