శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

భారతీయ ప్రియుడిపై ప్రేమ.. పిల్లల్ని తీసుకుని ఇండియాకు వచ్చిన పాక్ మహిళ

lovers
ఓ పాకిస్థాన్ మహిళ... భారతీయ ప్రియుడిపై మనసు పారేసుకుంది. ఆన్‌లైన్‌లో పబ్‌జీ గేమ్ ఆడే క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికిచెందిన ఓ వ్యక్తితో పాక్ మహిళకు పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో ఆ ప్రేమ కాస్త ప్రేమగా మారింది. అదేసమయంలో ఆమె ప్రియుడిని ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె కట్టుకున్న భర్తను వదిలివేసి, తన ముగ్గురు పిల్లలను తీసుకుని నేపాల్ మీదుగా భారత్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గ్రేటర్ నోయిడాలో ప్రియుడితో కలిసి కాపురం చేయసాగింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. యూపీలోనే గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడే క్రమంలో ఓ పాకిస్థాన్ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చివరకు ప్రేమగా మారింది. పైగా, ఆమె ప్రియుడికి దూరంగా ఉండలేకపోయింది. ఈ వివాహితకు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ప్రియుడి కోసం పరితపించసాగింది. ఈ క్రమంలో తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. నేపాల్ మీదుగా భారత్‌కు చేరుకుని ప్రియుడిని కలుసుకుంది. ఆ తర్వాత వారంతా కలిసి గ్రేటర్ ఇండియాలో జీవనం సాగిస్తూ వచ్చారు. 
 
అయితే, పాకిస్థాన్ మహిళ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిందన్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు రంగంలోకి దిగి ఆ మహిళ, ఆమె నులుగురు పిల్లలు, ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ మహిళను చూస్తే పాకిస్థాన్ నుంచి వచ్చినట్టుగా అస్సలు అనుమానం కలగలేదని అందుకే తాను ఇంటిని అద్దెకు ఇచ్చినట్టు ఇంటి యజమాన్ని పోలీసులకు చెప్పాడు. దీనిపై గ్రేటర్ నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
నమ్మి వచ్చిన డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం 
 
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. తన స్నేహితులే కదా అని నమ్మి వెళ్లినందుకు ఆమెపై లైంగికదాడి జరిగింది. మొత్తం ఏడుగురు మిత్రుల్లో ఒకడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్‌కు చెందిన విద్యార్థిని, నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగు బైక్‌లపై ఆదివారం ములుగు జిల్లా వాజేడుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రింగ్‌ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వరకు చేరుకుని విశ్రాంతి కోసం కొద్దిసేపు ఆగారు. 
 
ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన విద్యార్థినిని... ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్‌ అనే విద్యార్థి మాట్లాడే పనుందని చెప్పి... రింగ్‌ రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బైక్‌పై పారిపోయాడు. 
 
మిగతా మిత్రులు బాధితురాలిని వరంగల్‌లో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.