గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (16:01 IST)

సీబీఓఐ నోటిఫికేషన్ విడుదల.. వెయ్యి ఉద్యోగాలు భర్తీ

Jobs
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఓఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీఓఐ తమ శాఖలలో ఖాళీగా వున్న వెయ్యి గ్రేడ్ -2 మేనేజర్ స్థాయి పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
డిగ్రీ అర్హతతో జూలై 15లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐబీపీఎస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
వేతనం- 48,170 నుంచి రూ.69,810 
వయోపరిమితి- 31-05-2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు. 
దరఖాస్తు విధానం- ఆన్‌లైన్ 
దరఖాస్తు గడువు - జూలై 15