రాత పరీక్ష లేకుండానే తపాలా శాఖలో ఉద్యోగాలు
భారత తంతి తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తుల గడువు ముగింపు తేదీ సమీపిస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి మే నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
కేవలం పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టులకు మే 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ జూన్ 11వ తేదీతో ముగియనుంది. అందువల్ల ఆసక్తికలిగిన అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.