ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (16:59 IST)

పరీక్ష లేదు.. పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 పోస్టులు..

Indian Post
పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్‍ను విడుదల చేసింది. దరఖాస్తులకు ఆఖరు గడువు జూన్ 11గా ఉంది. 
 
ఈ నోటిఫికేషన్‍లో.. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‍లో 118 పోస్టులు, తెలంగాణ సర్కిల్‍లో 96 పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టాఫీస్ పోస్టులకు దరఖాస్తు చేసే వారి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 
 
పదో తరగతిలో సాధించిన మార్కులు, గ్రేడ్స్, పాయింట్స్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఇండియా పోస్ట్ ఎంపిక చేస్తుంది. ఈ పోస్టుల కోసం ఎలాంటి పరీక్ష ఉండదు.