సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:43 IST)

ఢిల్లీ టూర్ ఓవర్.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌గా మారిన పవన్

Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh
గత రాత్రి తన ఢిల్లీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తరువాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం తన కొత్త చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్" రెగ్యులర్ షూట్‌లో పాల్గొన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో నిర్మాణాన్ని ప్రారంభించింది.
 
తొలిరోజు పవన్ కళ్యాణ్, ఇతర నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి భారీ పోలీస్ సెట్‌ను రూపొందించారు. గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' తెరకెక్కిన సంగతి తెలిసిందే.
 
ఇక ఉస్తాద్‌లో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే నటించే అవకాశం ఉంది. శ్రీలీల ఇప్పటికే రెండో కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి అయనంక బోస్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పవన్ కళ్యాణ్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇది మొదటి సినిమా.