సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (10:52 IST)

గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ... ఎక్కడ?

school students
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీచేసింది. డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. 
 
అదేవిధంగా జూనియర్‌ కళాశాలల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 12 నుంచి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ మల్లయ్యభట్టు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.