శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (20:23 IST)

ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ (Video)

Dr BR Ambedkar
Dr BR Ambedkar
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ లేక్ సమీపంలో ఉన్న అంబేద్కర్ ఎత్తైన కాంస్య విగ్రహం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది హాజరవుతారు.
 
ఈ కార్యక్రమానికి డాక్టర్ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అంబేద్కర్ విగ్రహంకు చెందిన డ్రోన్ విజువల్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.