శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (09:20 IST)

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ తిరిగిందా.. వీడియో వైరల్

tirumala
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో డ్రోన్ తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ డ్రోన్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆలయ భద్రతపై ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన ఐకాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించలేదు. పటిష్ట భద్రత కలిగిన తిరుమల వెంకన్న ఆలయంపై డ్రోన్ ఎలా ఎగరగలిగింది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
 
దీనిపై టీటీడీ అధికారులు స్పందించారు. ఆలయంపై డ్రోన్ ఎగురుతున్న వీడియో నిజం కాదన్నారు. ఆ వీడియో డ్రోన్ ద్వారా రికార్డ్ చేయబడిందా లేదా గూగుల్, 3D విజువల్స్ నుండి పొందబడిందా అని నిర్ధారించడానికి విశ్లేషణ కోసం వీడియోను ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపుతామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.