ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Modified: శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (21:21 IST)

మూడోసారి ముచ్చటగా అరుణ్ జైట్లీ ప్రకటన: చెప్పిందే చెప్పి...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన బీజేపీ ప్రభుత్వానికి ఏపీ టీడీపీ ఎంపీలు చుక్కలు చూపిస్తున్నారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నారు. ఉభయ సభల్లో ఆందోళన పర్వం కొనసాగిస్తున్నారు. ఆరు రోజుల పాటు విభిన్న నిరసనల

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన బీజేపీ ప్రభుత్వానికి ఏపీ టీడీపీ ఎంపీలు చుక్కలు చూపిస్తున్నారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నారు. ఉభయ సభల్లో ఆందోళన పర్వం కొనసాగిస్తున్నారు. ఆరు రోజుల పాటు విభిన్న నిరసనలతో పార్లమెంట్‌ను అట్టుడికించారు. 
 
ఈ క్రమంలో రెండుసార్లు ఏపీకి సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసినా.. టీడీపీ ఎంపీలు ఏమాత్రం సంతృప్తి చెందకపోవడంతో రాజ్యసభలో మూడోసారి ముచ్చటగా వివరణ ఇచ్చేందుకు జైట్లీ ప్రసంగం చేశారు. 
 
అంతకుముందు మూడోసారి చేసే ప్రకటనలో ఏపీ గురించి స్పష్టమైన అంశాలుండాలని టీడీపీ ఎంపీలు పట్టుబడుతున్నారు. అరుణ్‌ జైట్లీ, అమిత్‌షాతో సుజనా మంతనాలు చేశారు. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ మూడోసారి చేసిన ప్రసంగంలో పాత కథనే కొత్తగా చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ భారీ ఆదాయం కోల్పోయిందన్నారు.
 
రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, పారిశ్రామిక కారిడార్‌పై ఆయా శాఖలు పరిశీలిస్తున్నాయన్నారు. దీంతో మూడోసారి కూడా కొత్త ప్రకటన చేయని జైట్లీ ప్రసంగాన్ని టీడీపీ ఎంపీలు వింటున్నా.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని, పోలవరం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. రెవెన్యూ లోటు ఎంత అనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు జైట్లీ వెల్లడించారు.