సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 జులై 2021 (13:54 IST)

ఇంటి వద్దే ఆధార్‌తో ఫోన్‌నంబర్‌ అనుసంధానం

సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్‌ కార్డుతో ఫోన్‌నంబరు అనుసంధానం తప్పనిసరి. దీని కోసం చాలా మంది ఇటీవల ఆధార్‌ సీడింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇకనుంచి ఆధార్‌ కార్డులో ఫోన్‌నంబరు అప్‌డేట్‌ చేయించుకునేందుకు సీడింగ్‌ కేంద్రం వరకు వెళ్లనక్కర్లేదు.

పోస్టుమ్యాన్‌కు కబురు పెడితే ఆయనే వచ్చి అవన్నీ మీ ఇంటి వద్దే చేస్తారు. రూ.50 చెల్లించి ఈ సేవలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ తపాలా శాఖ జూన్‌ నుంచి ఈ తరహా సేవలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 5లక్షల మంది ఈ సేవలు పొందారు.

భీమవరం, ఏలూరు, గుడివాడ, నెల్లూరు, విజయనగరం తపాలా డివిజన్లలో ఈ సేవలు ఇప్పటివరకు ఎక్కువగా అందాయి. పోస్టుమ్యాన్ల వద్ద ఒక మొబైల్‌ అప్లికేషన్‌ ఉంటుంది. దాని సాయంతో వారు వినియోగదారుల మొబైల్‌ నంబరును ఆధార్‌ కార్డుకు అనుసంధానిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సాయంతో గ్రామీణ తపాలా సేవకులు వినియోగదారులను చేరుకుంటున్నారు. తమకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఇంకా సుమారు 1.92 కోట్ల ఆధార్‌ కార్డుల ఫోన్‌నంబర్లు అప్‌డేట్‌ చేయాల్సి ఉందని ఏపీఎంజీ సుధీర్‌బాబు తెలిపారు.