గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (15:49 IST)

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ భూమిపూజ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో మౌలిక వసతుల రూపకల్పన కోసం పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక బృహత్తర ప్రాజెక్టులు చేపడుతున్నారు. తాజాగా ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ ఎయిర్‌పోర్టు నోయిడాలో నిర్మించనున్నారు.
 
దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరువలో గౌతం బుద్ధ నగర్‌ జిల్లాలోని జెవార్ ప్రాంతంలో 1300 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.10,050 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దీనికి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని పేరు పెట్టారు. వచ్చే మూడేళ్ళలో అందుబాటులోకి తీసుకొచ్చేలా దీన్ని ప్రాన్ చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో నాలుగో ఎయిర్‌పోర్టుగా అవతరించనుంది.