ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:53 IST)

బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం: నీట మునిగిన విమానాశ్రయం.. ట్రాక్టర్ రైడ్

Bengaluru
క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు సోమ‌వారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో బెంగ‌ళూరు సిటీ జ‌ల‌మ‌యం అయింది. లోత‌ట్టు ప్రాంతాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది.

భారీవర్షాల వల్ల బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. వందలాది టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు టెర్మినల్స్‌లోకి ప్రవేశించలేకపోతున్నారు.
 
ఎలాంటి మార్గం లేకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి ట్రాక్టర్ రైడ్ చేయాల్సి వచ్చింది. విమానాశ్రయానికి విమాన ప్రయాణికులు ట్రాక్టర్లపై వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఐటీ హబ్‌లోని కోనప్పన అగ్రహార పరిసరాల్లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.