శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (11:03 IST)

దడపుట్టిస్తున్న 'ఒమిక్రాన్' : ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక భేటీ

ప్రపంచాన్ని మరోమారు కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన బి.1.1.529 వణికిస్తోంది. ఈ వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్ సంస్థ ఒమిక్రాన్ అనే పేరును ఖరారు చేసింది. ఈ వేరియంట్ ఆఫ్రికా దేశాలను భయపెడుతోంది. దీంతో ఈ దేశాలపై ప్రపంచ దేశాలు ట్రావెన్ బ్యాన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో ఒమిక్రాన్ వేరియంట్‌పై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఈ వేరియంట్‌లో 32 మ్యుూటేషన్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా, కరోనా వైరస్ వచ్చిన వారికి కూడా ఇది సోకుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో ఈ వేరియంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.