బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (09:48 IST)

కిడ్నాప్ అయిన బాలికపై పోలీసు అత్యాచారం-హత్య: వారం రోజులు బంధించి?

కాపాడాల్సిన రక్షకుడే ఆ బాలికను కాటేశాడు. అవును.. పోలీసే దారుణానికి ఒడిగట్టాడు. కిడ్నాపైన బాలికను వెతికేందుకు వెళ్లిన పోలీసు వారం రోజుల పాటు బాలికను బంధించిన అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మూ కాశ్మీర్‌ల

కాపాడాల్సిన రక్షకుడే ఆ బాలికను కాటేశాడు. అవును.. పోలీసే దారుణానికి ఒడిగట్టాడు. కిడ్నాపైన బాలికను వెతికేందుకు వెళ్లిన పోలీసు వారం రోజుల పాటు బాలికను బంధించిన అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూ-కాశ్మీర్‌, కతువా జిల్లా, రసనా గ్రామంలోని నోమాద్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక జనవరి 10వ తేదీన గుర్రాపు మేపుతుండగా అపహరణకు గురైంది. 
 
తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అధికారే బాలిక పట్ల యముడిగా మారాడు. ఈ మేరకు బాలికను గుర్తించిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దీపక్ ఖుజారియా (28) ఆమెను వెంటనే తల్లిదండ్రులకు అప్పగించలేదు. వారం రోజుల పాటు బంధించాడు.
 
మరో బాలుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను దారుణంగా హత్యచేసి పొలాల్లో పడేశారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం పోలీసులు చేధించారు. ఈ ఘటనలో దీపక్ హస్తం వుందని అతనని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.