ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (11:25 IST)

యూట్యూబర్ అమిత్ శర్మకు పాము కాటు

YouTuber
YouTuber
రాజస్థాన్‌లోని అత్యంత పాపులర్ యూట్యూబర్ అమిత్ శర్మ పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమిత్ శర్మను నాగుపాము కరిచింది. పాముకాటుతో అతని పరిస్థితి విషమంగా ఉంది. అతని స్నేహితుడు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాడు. 
 
అమిత్ శర్మ 'క్రేజీ xyz'అనే యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. అతనికి 25 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన వీడియోలు-రాజస్థాన్‌లో అత్యధిక వసూళ్లు చేసిన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు 9 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడని చెప్పబడింది. అతను ఐఐటీ రూర్కీ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ కావడం విశేషం.