శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (12:01 IST)

విద్యార్థినిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించి జైలుపాలైన ప్రొఫెసర్.. ఎక్కడ?

victim
తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదన్న కోపంతో ఓ విద్యార్థినిని ప్రొఫెసర్ ఒకరు ఫెయిల్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీలో బాధితురాలు చివరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసే ఓ గిరిశ్ పర్మార్ ఆ విద్యార్థినిపై కన్నేశాడు. దీంతో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. 
 
దీనికి ఆమె అంగీకరించలేదు. అర్పిత్ అగర్వాల్ అనే విద్యార్థి ద్వారా కూడా ఒత్తిడి తెచ్చాడు. అప్పటికీ ఆమె లొంగలేదు. దీంతో ఆ విద్యార్థిని తాను బెదిరించినట్టుగానే పరీక్షల్లో ఫెయిల్ చేశాడు. 
 
తాను పరీక్షల్లో ఫెయిల్ కావడంతో షాక్‌కు గురైన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో... ఈ విద్యార్థినినే కాకుండా మరికొందరు విద్యార్థినిలను కూడా బెదిరించినట్టు తేలింది.