గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (15:49 IST)

నా పేరును ఎంపిక చేయగానే ప్రణబ్ నొచ్చుకున్నారు : మన్మోహన్

దేశ ప్రధానిగా తన పేరును ఎంపిక చేయగానే సీనియర్ నేతగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తికి లోనై నొచ్చుకున్నారనీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

దేశ ప్రధానిగా తన పేరును ఎంపిక చేయగానే సీనియర్ నేతగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తికి లోనై నొచ్చుకున్నారనీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో మన్మోహన్ పాల్గొని మాట్లాడుతూ, తాను యాక్సిడెంటల్‌గా (అనుకోకుండా) రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తనను కేబినెట్‌లోకి ఆహ్వానించి ఆర్థిక మంత్రిని చేశారని చెప్పుకొచ్చారు. 
 
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ప్రణబ్‌ను ప్రధానిగా ఎన్నుకోకపోవడంతో ఆయన బాధపడే ఉంటారని వ్యాఖ్యానించారు. పైగా, తనకంటే ప్రణబ్ మంచి నేత అని మన్మోహన్ అన్నారు. మన్మోహన్ వాఖ్యలపై ట్విట్టర్‌లో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. నిజమా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, ఆ ప్రమాదం కారణంగా పదేళ్లు భరించాల్సి వచ్చిందని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక నుంచి మిమ్మల్ని యాక్సిడెంటల్ పీఎం అని పిలుస్తామని మరికొందరు కామెంట్ చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ప్రధాని అయ్యారని ఇంకొకరు పోస్ట్ చేశారు.