బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (12:33 IST)

సోనియా గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీ.. అక్కడ నుంచి పోటీ?

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి పలకనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్ అధినేత్రి పగ్గాలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి పలకనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్ అధినేత్రి పగ్గాలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. 
 
సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందున రాయ్ బరేలీ స్థానంలో కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నుంచి లోక్ సభ స్థానానికి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారని సమాచారం. 
 
ప్రియాంకా గాంధీ కూడా రాజకీయ ప్రవేశంపై ఎంతో ఆసక్తితో ఉన్నట్లు మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గయప్రసాద్ మరణానికి ముందే తెలిపినట్లు ఆయన కుమారుడు జగదీష్ శుక్లా రాయ్ తెలిపారు. రాజకీయాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని జగదీష్ చెప్పుకొచ్చారు.  
  
రాహుల్‌తో పోలిస్తే.. ప్రియాంకా గాంధీ తన ఆలోచనలను నిక్కచ్చిగా చెప్పగలరని.. రాహుల్ మితభాషి కావడంతో వీరిద్దరి కలయికతో కాంగ్రెస్ పార్టీకి కొత్త కళ రావడం ఖాయమని జగదీష్ శుక్లా వివరించారు. 2019లో రాయ్ బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారా అని కార్యకర్తలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.