శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (22:36 IST)

పదేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకుంది.. శోభనం అయ్యాక పొమ్మంది.. ఎవరు..?

పదేళ్ల చిన్నవాడైన కుర్రాడిని, తన స్టూడెంట్‌ను బలవంతంగా ఓ యువతి పెళ్లి చేసుకున్న ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. తనకు మాంగల్య దోషం వుందని బలంగా నమ్మింది. ఈ కారణంగానే తనకు పెళ్లి కావడం లేదని జ్యోతిష్యుడు, తన తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని బాగా చెవికెక్కించుకుంది. ఈ దోషం పోవాలంటే తన కంటే చిన్నవాడైన కుర్రాడితో పెళ్లి జరగాలని జ్యోతిష్యుడు చెప్పిన మాటలను బాగా గుర్తు పెట్టుకుంది.
 
ఇందుకోసం తన దగ్గరకు ట్యూషన్‌కు వచ్చే ఓ కుర్రాడిని ఎంచుకుంది. అతడికి ప్రత్యేక క్లాసుల పేరుతో అతడిని పూర్తి సంప్రదాయబద్ధంగా అతడిని పెళ్లాడింది. పెళ్లికి ముందు జరిపే మెహదీ ఫంక్షన్‌ను కూడా నిర్వహించారు. ఆ తరువాత పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత జరిగే శోభనం కార్యక్రమాన్ని కూడా తూతూమంత్రంగా నిర్వహించారు. 
 
ఆ తరువాత తన భర్త చనిపోయాడనుకుని విధవగా మారే కార్యక్రమాన్ని.. ఆ తరువాత తన భర్త సంతాప కార్యక్రమాన్ని కూడా పూర్తి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వారం తరువాత తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిన కుర్రాడు.. ఈ విషయాలన్నీ వారికి చెప్పాడు. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరుపక్షాలతో పోలీసులు మాట్లాడి సయోధ్య జరిపినట్టు తెలుస్తోంది.