మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (10:57 IST)

మద్రాసు వర్శిటీలో లైంగిక వేధింపుల కలకలం.. హెచ్‌వోడీ అలా తాకాడు..

తమిళనాట గతంలో యూనివర్శిటీలో విద్యార్థులపై లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మద్రాస్ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్‌వోడీ) చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని 31 ఏళ్ల మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ నెల 16వ తేదీన ఇతర విద్యార్థుల ముందు తనతో హెచ్‌వోడీ అసభ్యంగా ప్రవర్తించాడని, తన శరీర భాగాలను తాకాడని సదరు యువతి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
 
అయితే అతడిని కాపాడేందుకు యూనివర్సిటీ యాజమాన్యం నియమించిన ఇంటర్నెల్ కంప్లైంట్స్ కమిటీ ప్రయత్నిస్తోందని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం యూనివర్సిటీలోని బాత్రూమ్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో సురక్షితంగా బయటపడింది. కాగా, ఆమెకు మద్దతుగా నలుగురు యువకులైన విద్యార్థులు యూనివర్సిటీ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు.