కోటీశ్వరుల కోట రాజస్థాన్ - 158 మంది ధనవంతులే...
ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. తాజా ఎన్నికల్లో రాజస్థాన్ 15వ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలలో 75శాతానికి పైగా కోటీశ్వరులే ఉన్నారు. అంటే మొత్తం 199 మంది గెలిచిన వారిలో 158 మంది కోటీశ్వరులో కావడం గమనార్హం.
2013 జరిగిన ఎన్నికల్లో 145 మంది కోటీశ్వరులు రాజస్థాన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం 99 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 82 మంది కోటిశ్వరులే. 73మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 58 మంది ధనవంతులు. ఇక 13 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 11 మంది, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలో ఐదుగురు కోటీశ్వరులే ఉన్నారు.
వీరంతా తమ నామినేషన పత్రాల్లో కోటి రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఆస్తులను కనబరిచారని అసోషియేషన్ ఫర్ డిమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ వెల్లడించిన నివేదికలో తెలిపింది. వీరందరి కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేత పరశురామ్ మోరాడియా రూ.172 కోట్ల ఆస్థులను ప్రకటించారు.
ఆ తర్వాత అదే పార్టీకి చెందిన ఉదయ్ లాల్ అంజనా రూ.107 కోట్లు, స్వతంత్ర అభ్యర్థి రాంకేష్ మీనా రూ.39 కోట్ల ఆస్తులను ప్రకటించారు. 59 మంది ఎమ్మెల్యేలు 5 నుంచి 12 వతరగతి చదవినట్లు తమ విద్యార్హతలో తెలిపారు. 129 ఎమ్మెల్యేలు డిగ్రీ కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు ఉన్నారని నివేదిక తెలిపింది.